ఫోర్‌ సీటర్‌ ఫ్లయింగ్‌ ట్యాక్సీ ఇది

ప్రపంచంలోనే మొదటి ఫోర్‌సీటర్‌ ఫ్లయింగ్‌ ట్యాక్సీని ఆవిష్కరించిన యూరప్‌ దేశమైన స్లొవేకియాలో ఏరోమొబిల్‌ కంపెనీ

దీని పేరు ఏఎం నెక్ట్స్‌. మరో ఐదేళ్లలో ఇది వినియోగంలోకి రానుంది.

2027నాటికల్లా 500 మైళ్ల దూరానికి ప్రయాణికులను తీసుకెళ్తుంది. ఈ కంపెనీ రూపొందించిన రెండో ఫ్లయింగ్‌ కారు ఇది

సూపర్‌కార్, తేలికపాటి విమానాల లక్షణాలుండే ఈ కారు మూడు నిమిషాల వ్యవధిలో తన ‘మోడ్‌’ను మార్చుకోగలదు.

ఈ కారు అందుబాటులోకి వస్తే ప్రయాణికుల విలువైన సమయం చాలా ఆదా అవుతుందని చెబుతున్న కంపెనీ

ముఖ్యమైన నగరాల మధ్య 100 నుంచి 500 మైళ్ల దూరం వెళ్లే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ అంటోంది.

ఇందులో వెళ్తే ప్రయాణ బడలిక అస్సలుండదని, ఆడుతూపాడుతూ వెళ్లొచ్చని, అదీగాక భూమ్మీద ఉండే అందాలను వీక్షిస్తూ వెళ్లొచ్చని చెబుతోంది.

ట్యాక్సీ ధర, అలాగే ప్రయాణికులకు టికెట్‌ ఎంత ఉంటుందన్నది కూడా వెల్లడించలేదు.