దేశంలో మారిన ఆధార్‌ నిబంధనలు

వీటిలో కొన్ని ఆధార్‌ కార్డుల వివరాలు సరిగా లేవంటూ కేంద్రం లెక్కలు

అందుకే దేశంలో ప్రతి వ్యక్తి పదేళ్లకోసారి ఆధార్‌ కార్డు వివరాల్ని అప్‌డేట్‌ చేసుకోవాలని సూచన

నిబంధనలను సవరిస్తూ గెజిట్ నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ

పదేళ్లకోసారి ఫ్రూఫ్‌ ఆఫ్‌ ఐడెంటిటీ , ఫ్రూఫ్‌ ఆఫ్‌ అడ్రస్‌ పత్రాలను సమర్పించడం ద్వారా కేంద్ర సమాచార నిల్వ కేంద్రం (సీఐడీఆర్‌)లో డేటా కచ్చితత్వంతో నిక్షిప్తం

గత నెలలోనే భారత విశిష్ట ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఆధార్‌ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి అప్‌డేట్ డాక్యుమెంట్ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది.

దీని ద్వారా యూజర్లు తమ వ్యక్తిగత వివరాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఆధార్‌ యూజర్లు ‘మై ఆధార్‌ పోర్టల్‌’ లేదా ‘మై ఆధార్‌ యాప్‌’ ద్వారా కానీ, దగ్గర్లోని ఆధార్‌ నమోదు కేంద్రానికి వెళ్లి పేరు, ఫొటో, అడ్రస్‌ వివరాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అప్‌డేట్ చేసుకోవచ్చు.