ఎలక్ట్రిక్‌ మేకర్స్‌ ఎప్పటికప్పుడు కొత్త హంగులతో వినియోగ దారులని ఆకర్షిస్తున్నాయి.

గృహిణుల శ్రమను తగ్గించే ఇలాంటి మేకర్స్‌కి మార్కెట్‌లో ప్రత్యేక స్థానం ఉంది

ఈ మ్యాజికల్‌ స్మార్ట్‌ మేకర్‌.. ఎయిర్‌ ఫ్రైయర్‌లా, ప్రెషర్‌ కుకర్‌లా పని చేస్తుంది

అందుకు చెయ్యాల్సింది కేవలం మూతలు మార్చడమే. స్టీమర్‌ బాస్కెట్, రోస్ట్‌ రాక్, రెసిపీ బుక్, గ్లాసులు, గరిటెలు, మిట్స్‌ వంటివన్నీ మేకర్‌తో లభిస్తాయి.

దాంతో ఇందులో సూప్స్, నూడూల్స్, కేక్స్, హోల్‌ చికెన్‌తో పాటు అన్నిరకాల రైస్‌ ఐటమ్స్‌ రెడీ చేసుకోవచ్చు

గాడ్జెట్‌ ముందు వైపు ఉన్న ఆప్షన్స్‌ ప్రెషర్‌ కుకర్‌కు, ఎయిర్‌ ఫ్రైయర్‌ లిడ్‌ మీద ఉన్న ఆప్షన్స్‌ ఫ్రైయర్‌ కోసం కేటాయించినవి

వాటిని సెట్‌ చేసుకుని టైమింగ్, టెంపరేచర్‌ ఫిక్స్‌ చేసుకుని, అవసరాన్ని బట్టి మూత మార్చుకుంటే సరిపోతుంది