టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖన్‌ ధావన్‌ పుట్టిన రోజు నేడు

అభిమానులు ధావన్‌ను ముద్దుగా గబ్బర్‌ అని పిలుచుకుంటారు

1985, డిసెంబరు 5న ఢిల్లీలో జన్మించిన శిఖర్‌ ధావన్‌

2004 అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నీతో వెలుగులోకి వచ్చిన ధావన్‌

నాటి ప్రపంచకప్‌ ఈవెంట్‌లో 505 పరుగులు చేసిన గబ్బర్‌

దేశవాళీ టోర్నీల్లో అద్భుత ప్రదర్శనతో జాతీయ జట్టులోకి ధావన్‌

2010లో విశాఖపట్నంలో ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ ‍క్రికెట్‌లో అడుగు

2011లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌తో టీ20లలో అరంగేట్రం

2013లో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన శిఖర్‌ ధావన్‌

ఇప్పటి వరకు 267 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ధావన్‌

అంతర్జాతీయ ‍క్రికెట్‌లో 10856 పరుగులు పూర్తి చేసుకున్న గబ్బర్‌

2013 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన భారత జట్టులో సభ్యుడు

పలు వన్డే సిరీస్‌లలో టీమిండియాకు కెప్టెన్‌గా ధావన్‌

ఐపీఎల్‌-2023లో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా గబ్బర్‌

ధావన్‌ వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు

2012లో అయేషా ముఖర్జీని పెళ్లాడిన శిఖర్‌ ధావన్‌

అప్పటికే ఆయేషాకు ఇద్దరు కూతుళ్లు ఉండగా.. ధావన్‌తో కుమారుడు జొరావర్‌ సంతానం

2021లో భార్యతో విడిపోయిన ధావన్‌.. కెరీర్‌పైనే పూర్తి దృష్టి