భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా

1986 నవంబర్‌ 15న ముంబైలో జన్మించిన సానియా

చిన్ననాటి నుంచే టెన్నిస్‌పై మక్కువ

అంచెలంచెలుగా ఎదుగుతూ అగ్ర ప్లేయర్‌గా సానియా

మూడు డబుల్స్‌ గ్రాండ్‌స్లామ్, మూడు మిక్స్‌డ్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలిచి చరిత్ర సృష్టించిన సానియా

43 డబుల్స్‌ ట్రోఫీలు గెలిచిన సానియా మీర్జా

91 వారాలు వరల్డ్‌ నంబర్‌వన్‌గా కొనసాగిన సానియా

2008, 2012, 2016, 2020ల్లో నాలుగు ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్న సానియా

2016 రియో ఒలింపిక్స్‌లో రోహన్‌ బోపన్నతో కలిసి కాంస్య పతక పోరులో ఓడి నాలుగో స్థానం సాధించడమే ఆమె అత్యుత్తమ ప్రదర్శన

ఆసియా క్రీడల్లో 2 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలతో పాటు కామన్వెల్త్‌ క్రీడల్లో ఒక రజతం, ఒక కాంస్యం ఆమె గెలుచుకుంది.

ఎన్నో సవాళ్లు, ఒడిదుడుకులు ఎదుర్కొని దిగ్గజ ప్లేయర్‌గా ఎదిగిన సానియా

2010లో పాకిస్తానీ క్రికెటర్‌ షోయబ్‌ మలిక్‌ను వివాహం చేసుకున్న సానియా

వీరికి నాలుగేళ్ల కుమారుడు ఇజ్‌హాన్‌ ఉన్నాడు

కొడుకు ఇజహాన్‌ సమక్షంలో ఆఖరి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియా ఓపెన్‌ ఆడిన సానియా

దుబాయ్‌ ఓపెన్‌తో ప్లేయర్‌గా టెన్నిస్‌కు వీడ్కోలు