ఐపీఎల్‌లో సాహా ప్రదర్శనపై సచిన్‌ టెండూల్కర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేశాడు.

ఐపీఎల్‌లో సాహా మోస్ట్‌ అండర్‌ రేటెడ్‌ ప్లేయర్‌ అని ఆసక్తికర వ్యాఖ్యలు.

ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సాహా.. మోస్ట్‌ డేంజరెస్‌ ప్లేయర్‌గా మారాడని కితాబు.

సాహాను టీమిండియాకు ఎంపిక చేయాలని సెలెక్టర్లను కోరాడు.

ఐపీఎల్ 2022లో 9 మ్యాచ్‌లు ఆడిన సాహా.. 3 అర్ధసెంచరీలతో 312 పరుగులు చేశాడు.

స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌తో వివాదంలో ఇటీవలే క్లీన్‌ చిట్‌ పొందిన సాహా.. తాజాగా మరో వివాదానికి తెరలేపాడు.

బెంగాల్‌ రంజీ జట్టులో అవకాశం ఇస్తామన్నా.. తనను జట్టు నుంచి రిలీవ్‌ చేయాలని రాద్ధాంతం చేస్తున్నాడు.

టీమిండియా తరఫున 40 టెస్ట్‌లు, 9 వన్డేలు ఆడిన సాహా 3 సెంచరీల సాయంతో 1394 పరుగులు చేశాడు.

టెస్ట్‌ ప్లేయర్‌గా ముద్రపడిన సాహా.. ఆ ముద్రను చెరిపేసుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నాడు.

ఐపీఎల్‌లో 142 మ్యాచ్‌లు ఆడిన సాహా ఐపీఎల్‌లోనూ ఓ శతకం బాదాడు.