దక్షిణాఫ్రికా బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ విధ్వంసకర శతకం

ఆస్ట్రేలియాతో వన్డేలో 83 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్స్‌లు బాది 174 పరుగులు సాధించాడు

38 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న క్లాసెన్‌ 57 బంతుల్లోనే సెంచరీ చేశాడు

ఆ తర్వాత 26 బంతుల్లో మరో 74 పరుగులు చేశాడు క్లాసెన్‌.

తద్వారా వన్డే చరిత్రలో అత్యంత వేగంగా ఆస్ట్రేలియాపై శతకం బాదిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు.

అదే విధంగా వన్డే క్రికెట్‌ చరిత్రలో క్లాసెన్‌ ఐదో వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు

అంతేకాదు.. ఒకే బౌలర్‌ బౌలింగ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో బ్యాటర్‌ క్లాసెన్‌

వన్డేల్లో 200కు పైగా స్ట్రైక్‌రేటుతో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన తొలి క్రికెటర్‌గా క్లాసెన్‌ చరిత్ర సృష్టించాడు

అంతకు ముందు ఈ రికార్డు సంయుక్తంగా.. ఏబీడి(162 పరుగులు నాటౌట్‌), జోస్‌ బట్లర్‌(231.41 స్ట్రైక్‌రేటుతో 162 పరుగులు, నాటౌట్‌) పేరిట ఉండేది.

క్లాసెన్‌ ఇన్నింగ్స్‌ వల్ల 416 పరుగులు సాధించిన సౌతాఫ్రికా.. అత్యధికసార్లు 400కు పైగా స్కోర్‌ చేసిన జట్టుగా టీమిండియా రికార్డు(6 సార్లు) బద్దలు కొట్టింది