52 కేజీల ఫ్లయ్‌ వెయిట్‌ కేటగిరీలో ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌గా నిఖత్‌

ఫైనల్లో థాయ్‌లాండ్‌ బాక్సర్‌ జిత్‌పాంగ్‌ జుతమాస్‌ను 5-0 తేడాతో ఓడించి స్వర్ణం పతకం కైవసం

భారత్‌ తరఫున ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఐదో మహిళా బాక్సర్‌గా నిఖత్‌ జరీన్‌

ఇంతకముందు మేరీకోమ్‌, సరితా దేవి, జెన్నీ ఆర్‌ఎల్‌, లేఖా కేసీ భారత్‌ తరపున ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్స్‌గా నిలిచారు

ప్రపంచాన్ని గెలిచిన టర్కీలోనే నిఖత్‌ 2011లో జూనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌గా అవతరించింది

నిఖత్‌ జరీన్‌ స్వస్థలం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌ జిల్లా