భారత స్టార్‌ బాక్సర్‌, తెలంగాణ బిడ్డ నిఖత్‌ జరీన్‌

వరుసగా రెండోసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన నిఖత్‌

న్యూఢిల్లీలో జరిగిన 50 కేజీల విభాగం ఫైనల్లో ఆసియా చాంపియన్‌పై నిఖత్‌ విజయం

ఎన్గుయెన్‌ థి టామ్‌ (వియత్నాం)పై గెలిచి రూ. 82 లక్షల 34 వేలు ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్న నిఖత్‌

టోర్నీలో బెస్ట్‌ బాక్సర్‌గా అవతరించి ‘మహీంద్రా థార్‌’ వాహనం గెలిచిన నిఖత్‌

26 ఏళ్ల నిఖత్‌ ప్రపంచ చాంపియన్‌గా నిలవడం రెండోసారి

తద్వారా ప్రపంచ చాంపియన్‌షిప్‌ చరిత్రలో రెండు స్వర్ణాలు గెలిచిన రెండో భారతీయ బాక్సర్‌గా నిఖత్‌కు గుర్తింపు

దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ తర్వాత ఈ ఘనత సాధించిన నిఖత్‌

తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన నిఖత్‌ జరీన్‌

చరిత్ర సృష్టించిన బాక్సర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ సహా పలువురు ప్రముఖుల ప్రశంసల జల్లు

నిఖత్‌ జరీన్‌ సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది

తనకు సంబంధించిన అప్‌డేట్లు అభిమానులతో పంచుకుంటుంది

ప్రొఫెషనల్‌ సహా వెకేషన్‌ ఫొటోలు షేర్‌ చేస్తూ ఉంటుంది నిఖత్‌

ఇన్‌స్టాగ్రామ్‌లో నిఖత్‌కు రెండు లక్షలకు పైగా ఫాలోవర్లు

ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలతో చరిత్రకెక్కిన నిఖత్‌

అంచనాలకు మించి రాణించి అరుదైన ఘనత సాధించిన నిఖత్‌ జరీన్‌