భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన రెండో పిన్న వయస్కురాలిగా రికార్డుకెక్కిన షఫాలీ వర్మ

ఆడపిల్ల అయిన కారణంగా మొదట్లో తనతో ఎవరూ క్రికెట్‌ ఆడేవారు కాదట

ఎనిమిదేళ్ల వయసులో క్రికెట్‌లో ఓనమాలు దిద్దిన షఫాలీ

ప్రతి ఆదివారం షఫాలీని గ్రౌండ్‌కు తీసుకెళ్లిన తండ్రి సంజీవ్‌ వర్మ

అయితే, అక్కడ అబ్బాయిలే ఎక్కువగా ఉండేవారట

తండ్రి తమతో కలిసి షఫాలీని ఆడనివ్వాలని బతిమిలాడినా అమ్మాయి అన్న కారణంగా ఒప్పుకొనేవారు కాదట

చిన్న గాయమైనా తమనే తప్పుబడతారనే భయంతో అలా చేసేవారు

దీంతో షఫాలీ నిరాశ పడటంతో కూతురికి సలహా ఇచ్చిన తండ్రి

వెంటనే షఫాలీని బార్బర్‌ షాపునకు తీసుకెళ్లి అబ్బాయిల్లా జుట్టు కత్తించమని చెప్పిన సంజీవ్‌ వర్మ

అంతేకాదు అబ్బాయిల్లాగానే డ్రెస్‌ చేసుకోవాలని సూచించిన తండ్రి

అమ్మాయి అన్న కారణంగా క్రికెట్‌ అకాడమీలో దక్కని ఛాన్స్‌

అయినా పట్టువదలకుండా తండ్రీకూతుళ్ల ప్రయత్నాలు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న అకాడమీకి రోజూ సైకిల్‌పై ప్రయాణం

తండ్రీకూతుళ్లిద్దరూ క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ అభిమానులు

అనతికాలంలోనే భారత మహిళాజట్టులో షఫాలీకి చోటు స్మృతి మంధానతో ఓపెనింగ్‌ బ్యాటర్‌గా రాణిస్తున్న షఫాలీ

మిథాలీ రాజ్‌ సారథ్యంలో ఆడిన షఫాలీ

అండర్‌ 19 స్థాయిలో తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్‌ గెలిచిన మహిళా సారథిగా చరిత్ర

భారత మహిళా క్రికెట్‌కు తొలి ఐసీసీ ట్రోఫీ అందించిన రికార్డు సాధించిన షఫాలీ వర్మ