ఐపీఎల్ 2022 సీజన్‌లో గతేడాది రన్నరప్‌ కోల్‌కతా నైట్ రైడర్స్ కథ ముగిసింది.

ఉత్కంఠ పోరులో లక్నో చేతిలో స్వల్ప తేడాతో ఓటమిపాలై లీగ్‌ నుంచి నిష్క్రమించింది.

ఈ సీజన్‌ను విజయంతో ప్రారంభించి ఓటమితో ముగించింది.

ప్రస్తుత ఎడిషన్‌లో 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 8 పరాజయాలు నమోదు.

చెన్నైపై గ్రాండ్‌ విక్టరీతో బోణీ కొట్టి.. ఆతర్వాత ఆర్సీబీ చేతిలో ఓటమి.

రసెల్‌, కమిన్స్‌ విధ్వంసంతో పంజాబ్‌, ముంబైలపై భారీ విజయాలు.

ఢిల్లీ, సన్‌రైజర్స్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, ఢిల్లీ చేతిలో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో పరాజయం.

తిరిగి రాజస్థాన్‌పై గెలిచినా ఆ తర్వాతి మ్యాచ్‌లో లక్నో చేతిలో ఓటమి.

ఈ దశలో మేలుకుని ముంబై, సన్‌రైజర్స్‌లపై వరుస విజయాలు.

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో చేతిలో ఓటమిపాలై లీగ్‌ నుంచి నిష్క్రమణ.