ఐపీఎల్‌ 2022 సీజన్‌ కీలక దశకు చేరుకుంది. మరో రెండు, మూడు మ్యాచ్‌లు గడిస్తే ప్లే ఆఫ్స్‌ బెర్తులు ఖరారవుతాయి. గుజరాత్‌ టైటాన్స్‌ ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది.

అరంగేట్రం సీజన్‌లోనే అద్భుత విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్‌ టైటాన్స్‌.. 13 మ్యాచ్‌ల్లో 10 విజయాలతో టేబుల్‌ టాపర్‌గా నిలిచింది.

లక్నోపై విజయం సాధించడంతో రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువయ్యింది. ఆర్‌ఆర్‌ జట్టు 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో (0.304 రన్‌రేట్‌) రెండో స్థానంలో నిలిచింది.

రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైన లక్నో.. 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో (0.262 రన్‌రేట్‌) మూడో స్థానంలో నిలిచింది.

13 మ్యాచ్‌ల్లో 7 విజయాలు (-0.323 రన్‌రేట్‌) సాధించిన ఆర్సీబీ నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ రన్‌రేట్‌ తక్కువగా ఉండటంతో ప్లే ఆఫ్స్‌ అవకాశాలు క్లిష్టంగా మారాయి.

ఢిల్లీ క్యాపిటల్స్‌.. 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో (0.210 రన్‌రేట్‌) ఐదో స్థానంలో ఉంది. ఈ జట్టు మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉన్నాయి.

కేకేఆర్‌ 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో (0.160 రన్‌రేట్‌) ఆరో స్థానంలో నిలిచింది. కేకేఆర్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉన్నాయి.

పంజాబ్‌ కింగ్స్‌.. తమ చివరి మ్యాచ్‌లో ఆర్సీబీపై ఘన విజయం సాధించడంతో ప్లే ఆఫ్స్‌ రేసులో నిలిచింది. ఈ జట్టు 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో (0.023 రన్‌రేట్‌) ఏడో స్థానంలో నిలిచింది.

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఆరెంజ్‌ ఆర్మీ 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో (-0.270 రన్‌రేట్‌) ఎనిమిదో స్థానంలో నిలిచింది.

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై.. ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబర్చి ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఆ జట్టు 13 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించింది.

ఐదు సార్లు ఛాంపియన్‌ ముంబై.. 12 మ్యాచ్‌ల్లో కేవలం మూడంటే మూడు విజయాలు మాత్రమే సాధించి ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది.