ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో సెంచరీ బాదిన హుడా టీ20ల్లో పలు రికార్డులను తన పేరిట లిఖించికున్నాడు

ఈ ఇన్నింగ్స్‌లో 57 బంతులను ఎదుర్కొన్న హుడా 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 104 పరుగులు చేశాడు

టీమిండియా తరఫున టీ20ల్లో సెంచరీ బాదిన నాలుగో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు

పొట్టి క్రికెట్‌లో టీమిండియా తరఫున ఐదో అత్యధిక స్కోర్‌ (104) నమోదు

చిన్ననాటి స్నేహితుడు సంజూ శాంసన్‌తో కలిసి రెండో వికెట్‌ను రికార్డు భాగస్వామ్యం (176) నమోదు

టీ20ల్లో భారత్‌కు ఏ వికెట్‌కు అయినా ఇదే అత్యధిక భాగస్వామ్యం

అంతర్జాతీయ టీ20ల్లో రెండో వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం

ఐర్లాండ్‌లో సెంచరీ బాదిన తొలి భారత క్రికెటర్‌గా (టీ20ల్లో) రికార్డు

వన్‌డౌన్‌లో భారత్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ (104) నమోదు

వన్‌డౌన్‌లో రైనా తర్వాత సెంచరీ బాదిన క్రికెటర్‌గా రికార్డు

అంతర్జాతీయ క్రికెట్‌లో శతకం బాదిన 100వ భారత క్రికెటర్‌గా ఘనత