విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ గేల్‌ పుట్టినరోజు ఇవాళ

పూర్తి పేరు క్రిస్టోఫర్‌ హెన్రీ క్రిస్‌ గేల్‌

1979 సెప్టెంబర్‌ 21న కింగ్‌స్టన్‌(జమైకా)లో జననం

లుకాస్‌ క్లబ్‌లో క్రికెట్‌ ఓనమాలు.. 19 ఏళ్లకు ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌ ప్రారంభం

వెస్టిండీస్‌ తరపున అన్ని ఫార్మట్‌లలోనూ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు

తొలి వన్డే టీమిండియాతో(1999). కేవలం ఒక్క పరుగుకే ఔట్‌

వన్డేల్లో పదివేల పరుగులు పూర్తి.. టెస్ట్‌ల్లోనూ ప్రత్యర్థులపై కనికరం లేకుండా బాదుడు

టెస్ట్‌ ఫార్మట్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి బంతికే సిక్స్‌.. ఈ ఫీట్‌ సాధించిన తొలి ప్లేయర్‌

టీ20 ఫార్మాట్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ(30 బంతుల్లో) రికార్డు. 2013లో పుణె వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ తరఫున ఈ ఫీట్‌

టీ20ల్లో తొలి సెంచరీ(57 బంతుల్లో 117 రన్స్‌) ఘనత. 2007లో టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా మీద..

బ్యాటింగ్‌లో ఓ ప్రత్యేక శైలి.. ఆటతో పాటు డ్యాన్సులతోనూ సందడి

గేల్‌ సునామీ, యూనివర్స్‌ బాస్‌, సిక్సర్ల మెషిన్‌.. ఇలా ఎన్నో ట్యాగులు సొంతం