ఇంగ్లండ్‌ టెస్టు జట్టు కెప్టెన్‌గా బెన్‌ స్టోక్స్‌

స్టోక్స్‌ ఇంగ్లండ్‌ టెస్టు జట్టుకు 81వ కెప్టెన్‌

స్టోక్స్ 2013లో టెస్టుల్లో ఇంగ్లండ్‌ తరపున అరంగేట్రం చేశాడు

గత కొన్నేళ్లుగా ఇంగ్లండ్‌ టెస్టు వైస్‌ కెప్టెన్‌గా స్టోక్స్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

ఇప్పటి వరకు 73 టెస్టులు ఆడిన స్టోక్స్ 5,061 పరుగులతో పాటు.. 174 వికెట్లు పడగొట్టాడు

2020లో వెస్టిండీస్‌తో జరిగిన ఒక టెస్టులో ఇంగ్లండ్‌కు తాత్కాలిక కెప్టెన్‌గా స్టోక్స్‌ వ్యవహరించాడు

వరుస వైఫల్యాల నేపథ్యంలో ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్సీకి జో రూట్‌ ఇటీవల గుడ్‌బై చెప్పాడు

రూట్‌ కెప్టెన్సీలో ఇంగ్లండ్‌ ఆడిన గత 17 టెస్టుల్లో ఒక్క విజయం మాత్రమే సాధించింది

రూట్‌ సారథ్యంలో ఇంగ్లండ్‌ జట్టు యాషెస్‌ సిరీస్‌లోఘోర పరాభవం, వెస్టిండీస్‌ సిరీస్‌లో ఓటమి చెందింది

ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ రూట్‌ రాజీనామా