ఐపీఎల్‌లో అరుదైన రికార్డు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌

ఐపీఎల్‌లో 100 వికెట్లు పడగొట్టిన రెండో లెప్ట్మ్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌గా రికార్డులకెక్కిన అక్షర్‌

ఐపీఎల్‌-2022లో పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్‌ ఈ ఘనత సాధించాడు

ఈ ఘనత సాదించిన జాబితాలో రవీంద్ర జడేజా తొలి స్థానంలో ఉన్నాడు

ఇక ఐపీఎల్‌లో 1000 పరుగులతో పాటు 100 వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కూడా అక్షర్‌ చేరాడు

అంతకుముందు ఈ జాబితాలో రవీంద్ర జడేజా, డ్వేన్‌ బ్రావో, సునీల్‌ నరైన్‌ ఉన్నారు

ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో 14 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు అక్షర్‌ పడగొట్టాడు

ఇక ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది