ప్రపంచంలోనే అత్యంత భారీ విస్కీబాటిల్‌ పేరు.. ది ఇంట్రెపిడ్‌.

స్కాట్‌ల్యాండ్‌కు చెందిన మాకల్లన్‌ కంపెనీ తయారు చేసింది.

బాటిల్‌ ఎత్తు ఐదు అడుగుల 11 అంగులాలు.

అందులో లిక్కర్‌ కెపాసిటీ 311 లీటర్లు.. 32 ఏళ్ల కిందటే తయారు చేశారు.

కేవలం గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కించేందుకే దీనిని తయారు చేశారు.

ది ఇంట్రెపిడ్‌ బ్రాండ్‌ 444 ఫుల్‌ బాటిళ్లు కలిస్తే.. ఈ భారీ బాటిల్‌ నిండుతుంది.

రికార్డులతో పాటు పలు గౌరవాలను అందుకుంది ఈ భారీ విస్కీ బాటిల్‌.

ఈ మే నెల 25వ తేదీ నుంచి దీనిని వేలం వేయబోతున్నారు.

ఆ వచ్చిన డబ్బులో పాతిక భాగాన్ని ఛారిటీ కోసం ఇవ్వబోతున్నారు.

గతంలో ఓ విస్కీ బాటిల్‌ దాదాపు రూ. పద్నాలుగున్నర కోట్లకు అమ్ముడుపోగా.. ది ఇంట్రెపిడ్ అంతకు మించి పోవచ్చని అనుకంటున్నారు.