దాదాపు పదేళ్ల గ్యాప్‌ అనంతరం రీఎంట్రీ ఇచ్చాడు నటుడు వేణు తొట్టెంపూడి

చివరగా రామాచారి వీడో పెద్ద గూఢచారి సినిమాలో కనిపించిన వేణు ఆ తర్వాత నటనకు బ్రేక్‌ ఇచ్చాడు

సుదీర్ఘ విరామం అనంతరం ‘రామారావు ఆన్‌డ్యూటీ’ మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు

ఇందులో సీఐ మురళీగా ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ.. సినిమా మాత్రం ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది

అయినప్పటికీ వేణుకి మరో క్రేజీ ఆఫర్‌ తలుపు తట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి

త్రివిక్రమ్‌-మహేశ్‌ బాబు కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రంలో వేణు కీ రోల్‌ పోషించనున్నట్లు సమాచారం

SSMB28 అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కే ఈ చిత్రంలో త్రివిక్రమ్‌ వేణుని ఎంపిక చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి

దీనిపై త్వరోనే అధికారిక ప్రకటన కూడా రానుందట

వేణు తొలి చిత్రం ‘స్వయంవరం’ చిత్రానికి త్రివిక్రమ్‌ కథ, మాటలు అందించిన సంగతి తెలిసిందే