తెలుగు సినిమాల్లో తనదైన శైలిలో వినోదాన్ని పండిస్తూ బ్లాక్ బస్టర్స్ అందించి దర్శకుడు శ్రీను వైట్ల

నేడు(సెప్టెంబర్‌ 24) శ్రీను వైట్ల బర్త్‌డే. 1972 సెప్టెంబర్‌ 24న తూర్పు గోదావరి జిల్లా కందుల పాలెంలో జన్మించారు.

నీ కోసం తో దర్శకుడిగా పరిచయమయ్యి మొదటి చిత్రంతోనే ఉత్తమ నూతన దర్శకుడిగా నంది అవార్డ్ అందుకున్నాడు.

అందరూ కొత్తవారితో నిర్మించిన ‘ఆనందం’ తో భారీ విజయం సాధించి పరిశ్రమలో సంచలనం సృష్టించారు.

వెంకీ, ఢీ, దుబాయ్ శీను, రెడీ, కింగ్, నమో వెంకటేశ, తో మెమొరబుల్ హిట్స్ సాధించిన శ్రీను వైట్ల దూకుడు తో తిరుగులేని హిట్ కొట్టారు.

తర్వాత వచ్చిన బాద్ షా తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

టాలీవుడ్ లో అందరు స్టార్ హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించి హిట్ చిత్రాలు అందించిన ఘనత శ్రీను వైట్ల సొంతం.

శ్రీను వైట్ల ప్రస్తుతం అగ్ర హీరో తో కలిసి భారీ ప్రాజెక్ట్ తో మరో సారి తన మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ కాంబినేషన్ కి సంబందించిన ప్రకటన అతి త్వరలో వెలువడనున్నట్లు సమాచారం.