సాయి పల్లవి.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు
అందం, అభినయంతో పాటు డాన్స్‌తో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది
చివరగా శ్యామ్ సింగరాయ్ చిత్రంలో మెరిసింది
త్వరలోనే ‘విరాట పర్వం’ చిత్రంతో పలకరించబోతుంది
ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన ఆమెకు ఐటెం సాంగ్స్‌పై ప్రశ్న ఎదురైంది
ఐటెం సాంగ్స్ తనకు కంఫర్ట్ కాదని సమాధానం ఇచ్చింది
అసలు అలాంటి పాటల్లో నటించే ఆసక్తే లేదని తేల్చి చెప్పేసింది
ఇక చివరగా ప్రేమపై అభిప్రాయం ఏంటని హోస్ట్ అడగిన ప్రశ్నకు..
జీవితానికి కెరీర్ ఎంత ముఖ్యమో ప్రేమ కూడా అంతే ముఖ్యమంది
ప్రేమ, కెరీర్లో ఏది లేకపోయిన జీవితం సంపూర్ణం కాదని సమాధానం ఇచ్చింది
ఆమె రానాకు జోడిగా నటించిన ‘విరాట పర్వం’ జూన్ 1వ తేదీన రిలీజ్ కాబోతోంది