‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు

సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా పూజా చక్రం తిప్పుతుంది

దక్షిణాదిలో ఆమె నటించిన సినిమాలన్ని వరుసగా సూపర్‌ హిట్‌ అందుకున్నాయి

దీంతో ఆమెకు సౌత్‌లోనే కాదు బాలీవుడ్‌ నుంచి కూడా ఆఫర్స్‌ వస్తున్నాయి

ఇక ఇటీవల ఆమె నటించిన రాధేశ్యామ్‌, బీస్ట్‌, ఆచార్య చిత్రాలు నిరాశ పరిచాయి

అయినా పూజా క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు, వరుస సినిమాలతో దూసుకుపోతుంది

ప్రస్తుతం హిందీలో ‘కభీ ఈథ్‌ కభీ దివాలీ’, సర్కస్‌ చిత్రాలతో పాటు తెలుగులో జనగనమణ వంటి ప్రాజెక్ట్స్‌ చేస్తుంది

రీసెంట్‌గా ఓ ఇంటర్య్వూలో తాను సినీరంగ ప్రవేశం చేసిన మొహంజోదారో చిత్రంపై సంచలన కామెంట్స్‌ చేసింది

ఈ చిత్రంలో ఆమె బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌తో జతకట్టింది

తన కెరీర్‌లో మొహంజోదారో ఒక చెత్త సినిమా అని, తన లీస్ట్‌ చిత్రాల్లో అది ఒకటే అని వ్యాఖ్యానించింది

ఆ సినిమా వల్ల తనకు ఏడాది పాటు ఎలాంటి అవకాశాలు రాలేదని చెప్పింది

దీని వల్ల తనకు ఐరన్‌ లెగ్‌ అనే పేరువచ్చిందని, ఆ సిని​మా చేయకుండ ఉండాల్సింది అని పేర్కొంది

దీంతో పూజా కామెంట్స్‌ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమయ్యాయి