టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌, భూమా మౌనిక వివాహబంధంతో ఒక్కటయ్యారు

ఫిలిం నగర్‌లోని మంచు లక్ష్మి నివాసంలో వీరి వివాహం ఘనంగా జరిగింది

శుక్రవారం రాత్రి 8.30 నిమిషాలకు మౌనిక మెడలో మూడు ముళ్లు వేశాడు మనోజ్‌

వేద మంత్రాల సాక్షిగా జరిగిన ఈ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది

ఇరు కుటుంబ సభ్యులు, అతి దగ్గరి బంధుమిత్రులు మాత్రమే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు

వైఎస్ విజయమ్మ గారు, టి జి వెంకటేష్, కోదండరామిరెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ, నిక్కీ గర్లని, దేవినేని అవినాష్ తదితరులు ఈ పెళ్లికి హాజరయ్యారు

అయితే మనోజ్-మౌనికల వివాహ వేడుకను కాస్త గోప్యంగానే ఉంచారు

పెళ్లికి అంత సిద్ధమై, ముహుర్తం ఫిక్స్‌ అయ్యేవరకు ఈ విషయం బయటకు రాకుండ జాగ్రత్త పడ్డారు

పెళ్లి వేడుకలో భాగంగా ఒక్కొ ఫొటో షేర్‌ చేసి అందరిని సర్‌ప్రైజ్‌ చేశారు

కాగా మనోజ్‌ అంటే మంచు లక్ష్మికి ఎంత ఇష్టమో తెలిసిందే

అందుకే మనోజ్‌ పెళ్లి బాధ్యతను తీసుకుని తన ఇంట్లోనే జరిపించింది. పెళ్లి పనులు అన్నీ దగ్గరుండి చూసుకుంది