చడీచప్పుడు లేకుండా వచ్చి యువత గుండెల్లో అలజడులు రేపింది కన్నడ బ్యూటీ కృతిశెట్టి

టాలీవుడ్‌లోకి ‘ఉప్పెన’లా దూసుకొచ్చి అతి తక్కువ సమయంలో నే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది

ఆకర్షించే ఆందంతో పాటు, ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకులకు తక్కువ సమయంలోనే ఎక్కువ దగ్గరైంది.

కెరీర్‌ స్టార్టింగ్‌లో కెరీర్ బిగినింగ్‌లోనే హ్యాట్రిక్ హిట్స్(ఉప్పెన, శ్యామ్‌ సింగరాయ్‌, బంగార్రాజు) అందుకొని​ లక్కీస్టార్‌ ముద్ర వేసుకుంది

అయితే ఇదంతా గతం.. ఇప్పుడు ఈ ‘బేబమ్మ’ వరుసగా హాట్రిక్‌ ప్లాపులను చవి చూసింది.ఇటీవల ఆమె నటించిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి చెప్పాలి చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తా పడ్డాయి.

వరుస ప్లాపులు..ఆమె కెరీర్‌ని ప్రమాదంలో పడేశాయి. ప్రస్తుతం కృతీ చేతిలో నాగచైతన్య, సూర్య చిత్రాలు ఉన్నాయి.

ఈ రెండు చిత్రాల ఫలితంపైనే ‘బేబమ్మ’ కెరీర్‌ ఆధారపడింది. ఇవి విజయం సాధిస్తే..కృతీ కెరీర్‌కి ఢోకా లేదు.. కానీ ఫ్లాప్‌ అయితే మాత్రం అవకాశాలు తగ్గిపోవడం ఖాయం