కీర్తి సురేశ్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతుందనే వార్త ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది

ఇంట్లో వాళ్లు చూసిన అబ్బాయితో కీర్తి ఏడు అడుగులు వేయటానికి రెడీ అయినట్లు టాక్‌ వినిపిస్తోంది

పెళ్లి కొడుకు ఓ వ్యాపారవేత్త అని, ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడని ప్రచారం జరుగుతోంది

అయితే ఈ పెళ్లి పుకారుపై కీర్తి సురేశ్‌ మాత్రం ఇంత వరకు స్పందించలేదు

వరుస సినిమాలతో దూసుకెళ్తున్న కీర్తి..అప్పుడే పెళ్లి చేసుకోబోదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు

కీర్తి ప్రస్తుతం తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌ జంటగా మామన్నన్‌ చిత్రంలో నటిస్తోంది.