వెబ్‌ స్క్రీన్‌ మీద తన చరిష్మా చూపిస్తున్న కరిష్మా శర్మ

పుట్టింది, పెరిగింది, చదివింది అంతా ఢిల్లీలోనే.

చిన్నప్పుడు సింగర్, చదువుకునేప్పుడు మోడల్, చదువు పూర్తయ్యాక నటి.. ఇలా ఒక్కో దశలో ఒక్కో కెరీర్‌ను ఎంచుకుంది కరిష్మా.

కాలేజీ రోజుల్లో చాలామంది తన శరీరాకృతిని, అందాన్ని ప్రశంసిస్తూండడంతో మోడల్‌ అవ్వాలని ముంబై చేరింది. కొద్ది రోజుల్లోనే బోల్డ్‌ అండ్‌ బిజీ మోడల్‌గా మారిపోయింది.

ఆమెలోని అభినయ కళను గ్రహించిన స్మాల్‌ స్క్రీన్‌... సీరియల్స్‌లో అవకాశాలను ఇచ్చింది.

‘ప్యార్‌ తూనే క్యా కియా’తో పరిచయమై వరుసగా ‘పవిత్ర్‌ రిష్తా’, ‘లవ్‌ బై ఛాన్స్‌’, ‘యే హై మొహబ్బత్‌’, ‘ఫియర్‌ ఫైల్స్‌’ లోనూ నటించింది.

‘ప్యార్‌ కా పంచనామా– 2’ తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ‘సూపర్‌ –30’ వంటి పలు సినిమాల్లోనూ మెరిసింది.

‘లైఫ్‌ సహీ హై’ సిరీస్‌తో వెబ్‌ దునియాలోకి అడుగుపెట్టి ‘రాగిణి ఎమ్‌ఎమ్‌ఎస్‌: రిటర్న్స్‌’, ‘హమ్‌’, ‘ఫిక్సర్‌’లతో అలరిస్తోంది