ఆమె సినిమాతో ఊహా-శ్రీకాంత్‌లకు పరిచయం ఏర్పడింది

ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెద్దల్ని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు

ఈ జంటకు ముగ్గురు పిల్లలు.. కుమారులు రోషన్‌, రోహన్‌, కుమార్తె మేధ

ఇప్పటికే శ్రీకాంత్‌ పెద్ద కుమారుడు రోషన్‌ వెండితెర అరంగేట్రం కూడా చేశాడు

ఇక శ్రీకాంత్‌ తన కుటుంబాన్ని మీడియాకు దూరంగా ఉంచుతారనే విషయం తెలిసిందే

బయట వ్యక్తిగత విషయాలను చర్చించేందుకు ఆయన పెద్దగా ఇష్టపడరు

అలాగే వారి పిల్లలు కూడా మీడియా ముందుకు చాలా అరుదుగా వస్తారు

ఈ క్రమంలో ఊహా-శ్రీకాంత్‌ విడాకుల రూమర్స్‌ ఒక్కసారిగా గుప్పుమన్నాయి

తాజాగా శ్రీకాంత్‌ తన విడాకుల ప్రచారంపై ఫైర్‌ అయ్యారు

విడాకుల రూమర్స్‌ను తీవ్రంగా ఖండిస్తూ.. ఈ వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పారు