టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు సోదరుడి కుమారుడు పెళ్లి ఈ నెల 14న రాజస్థాన్‌లోని జైపూర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.

ఏపీకి చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డిని ఆయన పెళ్లాడారు.

ఈ పెళ్లి వేడుకకు పలువురు టాలీవుడ్ సినీతారలు కూడా హాజరయ్యారు

ఈనెల 23న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ వేడుకను నిర్వహించారు

ఈ పార్టీకి టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు

మాదాపూర్‌లో ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ రిసెప్షన్‌ పార్టీకి వేదికైంది

రామ్ చరణ్, దక్షిణాది స్టార్ డైరెక్టర్ శంకర్, నాగార్జున, నాగచైతన్య, రష్మిక, కల్యాణ్‌ రామ్‌ తదితరులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు

రౌడీ బాయ్స్‌ అనే చిత్రం ద్వారా ఆశిష్ ఎంట్రీ ఇచ్చారు

ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించింది.

2022 జనవరిలో రిలీజైన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఆశిష్ రెడ్డి ప్రస్తుతం సెల్ఫీష్ అనే చిత్రంలో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి విశాల్ కాశీ దర్శకత్వం వహిస్తున్నారు.

త్వరలోనే ఈ మూవీ విడుదల కాబోతుంది