కమెడియన్‌ కిరాక్‌ ఆర్పీ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు

ప్రముఖ కామెడీ షోతో ఆర్పీ పాపులర్‌ అయ్యాడు

టైమింగ్‌ మిస్‌ కాకుండా పంచ్‌లు వేస్తూ స్కిట్లు వదులుతుంటాడు

తాజాగా తన ప్రియురాలు లక్ష్మీ ప్రసన్నను నిశ్చితార్థం చేసుకున్నాడు

బంధుమిత్రుల సమక్షంలో ఆర్పీ-లక్ష్మీ ప్రసన్నల ఎంగేజ్‌మెంట్‌ ఘనంగా జరిగింది

ఈ నిశ్చితార్థానికి నటుడు ధనరాజ్‌ కుటుంబ సమేతంగా హాజరై వారిని ఆశీర్వదించాడు

ఈ వేడుకకు మెగా బ్రదర్‌ నాగబాబు, ఆయన కూతురు నిహారిక హజరయ్యారు

అలాగే పలువురు కమెడియన్లు, బుల్లితెర సెలబ్రెటీలు హాజరై సందడి చేశారు

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి