సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న అఖండ డైలాగ్స్‌

బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వ‌స్తున్న మూడో చిత్రం అఖండ‌

న‌వంబ‌ర్ 14న అఖండ్ ట్రైల‌ర్ రిలీజైంది

ఈ ట్రైల‌ర్‌లో బాల‌య్య న‌ట‌విశ్వ‌రూపం చూపిస్తూ గ‌ర్జించిన డైలాగులు ఇవే..

అంచ‌నా వేయ‌డానికి నువ్వేమైనా పోల‌వ‌రం డ్యామా? ప‌ట్టిసీమ తూమా? పిల్ల కాలువ‌..

ఒక మాట నువ్వంటే అది శ‌బ్ధం, అదే మాట నేనంటే శాస‌నం.. దైవ శాసనం

ఒక‌సారి డిసైడ్ అయి బ‌రిలో దూకితే బ్రేకుల్లేని బుల్డోజ‌ర్‌ను.. తొక్కిపార‌దొబ్బుతా

మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం.. బోత్ ఆర్ నాట్‌ సేమ్

అఖండ‌ సినిమాకు థ‌మ‌న్ సంగీతం అందించారు

ద్వార‌కా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మించారు