తల్లి కాబోతున్న నమిత

సొంతం సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది నమిత

వెంకటేష్‌తో జెమిని, రవితేజతో ఒకరాజు-ఒకరాణి, ప్రభాస్‌తో బిల్లా, బాలయ్యతో సింహా వంటి సినిమాల్లో నటించింది

2017లో వ్యాపారి వీరేంద్ర చౌదరితో నమిత వివాహం జరిగింది

తన పుట్టిన రోజు (మే 10) సందర్భంగా అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది

తాను గర్భవతిని అని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది

బేబీ బంప్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ.. ప్రస్తుతం కొత్త అనుభూతిని ఆస్వాదిస్తున్నాను అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది

ఈ ఫోటోలను చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు నమితకు కంగ్రాట్స్‌ చెబుతున్నారు

41 సంవత్సరాలలో నమిత ప్రెగ్నెంట్ కావడం గమనార్హం.