పేల నివారణకు వెల్లుల్లి అద్భుతంగా పని చేస్తుంది

కొన్ని వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరి, దానికి కాస్త నిమ్మరసం కలపాలి.

ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి మునివేళ్లతో చిన్నగా మర్ధన చేయాలి.

గంటసేపు అలాగే ఉంచి.. గోరువెచ్చని నీటితో తలస్నానం చేసి.. దువ్వాలి.

వేపాకు మెత్తగా నూరి.. అందులోకి రెండుచుక్కలు ఆలివ్‌ ఆయిల్‌ కలపాలి.

దీనిని జుట్టు కుదుళ్లకు పట్టించాలి. గంట తరువాత స్నానం చేయాలి.

తెల్ల ఉల్లిగడ్డలు కూడా పేలను తగ్గించేవే.

ఈ ఉల్లితో రసం తీసి తలకు పట్టించాలి. గంట తరవాత స్నానం చేయాలి.

బాదం పప్పులను ఒకరోజు మొత్తం నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే వాటిపైనున్న తొక్కను తీసేసి.. మెత్తటి పేస్టులా రుబ్బుకోవాలి.

అందులోకి రెండుమూడు స్పూన్ల నిమ్మరసం కలిపి. జుట్టు కుదుళ్లకు పట్టించాలి.

వేపగింజల నూనె మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని తీసుకుని తలకు పట్టించవచ్చు.

లేదంటే వేపనూనెకు షాంపూను కలిపి కూడా జుట్టుకు అప్లై చేయవచ్చు.

ఆపిల్‌ సిడార్‌ వెనిగర్‌ను తలకు పూసుకుంటే పేలను తొలగిస్తుంది

గోరువెచ్చని కొబ్బరినూనె, బాదం నూనెలను తలకు పట్టించి, పొద్దున్నే తలస్నానం చేసి, దువ్వెనతో దువ్వాలి.

ఇలా రెగ్యులర్‌గా చేస్తుండడం వల్ల తలలో పేలు చేరకుండా ఉండడమే కాకుండా, జుట్టుకు మెరుపు వస్తుంది.