పాలు విరిగిపోయాయే! అని బాధపడక్కర్లేదు. వాటిని కూడా మనం ఇలా ఉపయోగించుకోవచ్చు

చపాతిల కోసం పిండి కలిపేటప్పుడు విరిగిన పాలను దానిలో పోసి పిండిని ముద్దగా కలిపి చపాతీలు చేసుకోవచ్చు

ఇలా చేస్తే చపాతీలు మృదువుగా, రుచిగా వస్తాయి.

కూర చేసేటప్పుడు గ్రేవీకోసం విరిగిన పాలను పోసి ఉడికిస్తే కూర రంగు, రుచి కూడా బావుంటుంది. పోషకాలు కూడా పెరుగుతాయి.

కేక్‌ల తయారీలో బేకింగ్‌ సోడాకు బదులు విరిగిన పాలను వాడటం వల్ల కేక్‌ సాఫ్ట్‌గా, టేస్టీగా వస్తుంది.

వెనిగర్‌ని, నీళ్లను సమపాళ్లలో తీసుకుని స్ప్రేబాటిల్‌లో పోయాలి.

ఈ వాటర్‌ను బాత్‌రూమ్‌ టైల్స్‌పై స్ప్రే చేసి స్పాంజి లేదా స్క్రబర్‌తో రుద్దితే టైల్స్‌ మెరుస్తాయి.

కప్పు నిమ్మరసంలో రెండు టీస్పూన్ల ఉప్పు వేసి టైల్స్‌ మీద బ్రష్‌తో రుద్ది 20 నిమిషాల తర్వాత కడగాలి. మురికితోపాటు క్రిములు పోతాయి.