ప్రస్తుత డిజిటల్ యుగంలో కంప్యూటర్స్, ల్యాప్‌టాప్స్, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌ వినియోగం భారీగా పెరిగింది

స్క్రీన్‌ టైం ఎక్కువైతే కంటికి విశ్రాంతిలేక డ్రై ఐ సమస్య

కంటి చూపు మందగించడం, కంటి పొరలు, రేచీకటి లాంటి సమస్యలను నిర్ల్యక్షం చేయకూడదు

కుటుంబంలో ఎవరికైనా కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే అప్రమత్తంగా ఉంటూసమస్యలొస్తే వైద్యులను సంప్రదించాలి

టీ, కాఫీ, ఆల్కహాల్, కెఫిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు కంటి ఆరోగ్యానికి హానిక

ఏ, బీ, సీ, జింక్‌, సెలీనీయం అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి.

డ్రై ఐస్‌ సమస్య ఉన్నవారు నీళ్లు ఎక్కువగా తాగాలి.

ప్రతీ రోజు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి. ఇవన్నీ మన శరీరంలో తేమ ఎక్కువగా ఉండేలా చేస్తాయి. దీని వల్ల కళ్లు పొడిబారకుండా ఉంటాయి.

ఆకు కూరలు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే చేపలు తినాలి.

వాల్‌నట్స్, బాదాం, అరటి పండ్లు, ఎండు ద్రాక్ష, అవకాడోలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

సూర్యుని నుంచి వచ్చే యూవీ కిరణాల వల్ల కళ్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం. సూర్యరశ్మి నుంచి కూడా దూరంగా ఉండాలి.

బయటకు వెళ్లే సమయంలో సన్‌, దుమ్ము, ధూళి, కాలుష్యం నుంచి కళ్లను కాపాడుకోవడానికి సన్ గ్లాసెస్ పెట్టుకుంటే మంచిది.