దీపావళి వేళ మెడ నిండుగా కాసుల పేరు

లోహమేదైనా... పండగ రోజున కాసుల పేరు మెడ నిండుగా

బంగారు కాసుల పేరు బామ్మలనాటి డిజైన్‌ అయినా నేటికి లక్ష్మీ కళను అందిస్తూనే ఉంది

ఆధునికతకు తగినట్టు సిల్వర్‌ కాయిన్లు రకరకాల డిజైన్లలో కనువిందుచేస్తాయి

ఆధునికతకు తగినట్టు సిల్వర్‌ కాయిన్లు రకరకాల డిజైన్లలో కనువిందుచేస్తాయి

కంచిపట్టుచీరకు కనకపు కాసు, సిల్క్‌ కుర్తాకు సిల్వర్‌ కాసు, వెస్ట్రన్‌ వేర్‌కు ఆక్సిడైజ్డ్‌ కాసు

కాసులు సిల్క్‌ దారాలతో జత కలుస్తున్నాయి, పూసలతో దోస్తీ కడుతున్నాయి

లోహానికి తగిన ధరల్లో వేల రూపాయల నుంచి వందల రూపాయల్లో రెడీమేడ్‌ కాసుల ఆభరణాలు

నూరు కాసులతో ఓ హారం లేదంటే నాలుగు కాసులతో సరిపెట్టుకునే హారమైనా అందమైన డిజైన్లతో తళుక్కుమంటుంది

ఆభరణాల జాబితాలో ఎప్పటికీ నిలిచి ఉండే కాసు హారాలు ఈ దీపావళి పండగకు కొత్త కళను నింపనున్నాయి