అత్యంత విషపూరితమైన వంటకాలు.. వీటిని తినడమంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమే!

అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వీటికి ఉ‍న్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు. ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఇష్టంగా తింటారట.

పఫర్‌ ఫిష్‌తో తయారు చేసే ఫూగు వంటకం.. జపాన్‌లో ఫేమస్‌ స్ట్రీట్‌ ఫుడ్‌.

పఫర్‌ ఫిష్‌ అత్యంత విషపూరితమైనది. దీనితో వంటలు చేయడానికి జపాన్‌లో ప్రత్యేకంగా ట్రైనింగ్‌ కూడా ఇస్తారట.

షెఫ్‌ (వంట చేసేవారు) ఏ మాత్రం ఏమరుపాటుగా వండినా దాన్ని తిన్నవారు ప్రాణాలు కోల్పోవటం ఖాయం!

చైనాలో బ్లడ్‌ క్లామ్‌లను తరచుగా తింటారు. తగు జాగ్రత్తలతో తినకపోతే టైఫాయిడ్, హెపటైటిస్‌ బారీన పడే ప్రమాదం ఉంది.

రెడ్‌ కలర్‌లో ఉండే పచ్చి కిడ్నీ బీన్స్‌లో భిన్న రకాలైన విష కారకాలు ఉంటాయి.

వీటిని వండకుండా పచ్చిగానే తింటే ఆసుపత్రిలో అడ్మిషన్‌ తీసుకోక తప్పదు.

అంతేకాకుండా పచ్చి కిడ్నీ బీన్స్‌ కంటే కూడా సరిగ్గా ఉడికించకుండా వీటిని తింటేనే అధికంగా హాని కలుగుతుందట.

పశువుల మెదడుతో తయారు చేసిన శాండ్‌విచ్‌ల వల్ల అనేక సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తున్న కారణంగా వీటి తయారీని నిషేధించారు కూడా.

పక్షి గూడుతో తయారు చేసే ఈ సూప్‌ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదట.

ఒక కప్పు బర్డ్స్ నెస్ట్ సూప్ సుమారు పది వేల డాలర్లు ఉంటుంది.

పక్షుల లాలాజలంతో తయారు చేసే చైనీయుల పురాతన వంటకం ఇది.

ఏది ఏమైనప్పటికీ దీనిని అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుంది.