నేడు అంతర్జాతీయ ప్రసంగ దినోత్సవం

మంచి గొంతు, భాష ఉన్నంతమాత్రాన గొప్ప ప్రసంగం అనిపించుకోదు.

భావోద్వేగాన్ని, ఆలోచనలను జత చేసి వ్యక్తీకరిస్తేనే అద్భుతమైన ప్రసంగమవుతుంది.

తమ ప్రసంగాలతో ప్రపంచగతిని మార్చేసిన కొందరు నేతలున్నారు.

మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ (జూనియర్‌) చేసిన ప్రసంగం అమెరికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాన్ని మలుపుతిప్పింది.

నెల్సన్‌మండేలా: రివోనియా ట్రయల్‌ దగ్గర 1964లో సౌత్‌ ఆఫ్రికా సుప్రీంకోర్టు ముందు ఆయన చేసిన ప్రసంగం చిరస్మరణీయం.

స్వామి వివేకానంద: 1893 సెప్టెంబర్‌ 11న చికాగోలో ప్రపంచ మతాల పార్లమెంట్‌ సందర్భంగా అద్భుత ప్రసంగం.

‘అమెరికా సోదర, సోదరీమణులకు’అంటూ ఆయన చేసిన ప్రసంగం రెండు నిమిషాల స్టాండింగ్‌ ఓవేషన్‌ అందుకుంది.

అత్యంత ప్రభావితం చేయగలిగిన వక్తల్లో ఒకరు మన జాతిపిత మహాత్మాగాంధీ.

1942 ఆగస్టులో క్విట్‌ ఇండియా ఉద్యమం సమయంలో ఆయన చేసిన ప్రసంగాలు భారత జాతిని మేల్కొల్పాయి.

1971 మార్చి 7న ఢాకాలోని రేస్‌ కోర్స్‌ మైదానంలో షేక్‌ ముజీబుర్‌ రెహ్మాన్‌ చరిత్రాత్మక ప్రసంగం.

ముజీబుర్‌ చేసిన ప్రసంగం భారత ఉప ఖండంలోని రాజకీయ ప్రసంగాలలోకెల్లా అత్యున్నతమైనదిగా నిలిచింది

ఆయన ప్రసంగాన్ని ప్రపంచ వారసత్వ డాక్యుమెంటరీగా యునెస్కో 2017లో గుర్తించింది.