సరిగా నిద్ర లేకపోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు

ప్రతి ఏటా మార్చినెల మూడో శుక్రవారం ప్రపంచ నిద్ర దినోత్సవం

2022 స్లీప్‌ డే థీమ్‌ ఏంటంటే.. ‘క్వాలిటీ స్లీప్‌, సౌండ్‌ మైండ్‌, హ్యాపీ వరల్డ్‌’

మారిన జీవనశైలితో పిల్లల నుంచి పెద్దల వరకు నిద్రలేమి సమస్యలు తలెత్తుతున్నాయి.

8 గంటల నిద్ర సరిగా లేకపోతే.. 16 గంటల మెలకువ సమయం డిస్ట్రట్‌ అవుతుంది.

నిద్ర సరిగా లేకపోతే.. మనిషి మెదడుపై తీవ్రమైన దుష్ప్రభావం తప్పదు.

నిద్రలేమితో రక్తప్రసరణ విషయంలో మార్పులు చోటు చేసుకుంటాయి.

రక్తప్రసరణలో మార్పులతో గుండెపోటు వచ్చే అవకాశాలుంటాయి.

నిద్ర సరిగాలేనివారికి బరువు పెరగడం, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి.

రోజులో 7 నుంచి 8 గంటల పాట నిద్రకు కేటాయించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

6 గంటల కంటే తక్కువ, 10 గంటల కంటే ఎక్కువ నిద్ర ఆరోగ్యానికి మంచిది కాదు.