వరల్డ్‌ హార్ట్‌ డే: హృదయమా.. కుశలమా!

మారిన జీవన శైలితో గుండె జబ్బు ముప్పు అధికం

పూర్వం గుండె జబ్బుతో పోయారు అనే మాట చాలా పెద్ద వయసువారికే పరిమితం

నేడు ఆ పరిస్థితి లేదు. మూడు పదులు దాటకుండానే గుండె లయ తప్పుతోంది

సరైన అవగాహన, గోల్డెన్‌ అవర్‌ (మొదటి 6 గంటలు)లో వైద్యం అందితే ప్రాణాలు కాపాడుకోవచ్చు

ఈకో, యాంజియోగ్రామ్‌ పరీక్షలు నిర్వహించి గుండె పరిస్థితి తెలుసుకుని సరైన చికిత్స అందించవచ్చు

గుండెపోటు జన్యుపరంగా కూడా వచ్చే అవకాశాలు అధికం. ధూమపానం, మద్యపానం మంచిది కాదు.

కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, బీపీ, షుగర్‌, ఊబకాయం వల్ల స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం

మానసిక ఆందోళనలు దూరం చేసుకోవాలి. లేదంటే గుండె సంబంధిత వ్యాధులు తప్పవు.

గుండెపోటు వచ్చినప్పుడు ఛాతి మధ్యభాగంలో బరువుగా ఉంటుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది.

చెమటలు పడతాయి, నడిచినా, మెట్లు ఎక్కినా ఆయాసం వస్తుంది. ఈ లక్షణాలుంటే డాక్టర్‌ని సంప్రదించాలి.

గుండెపోటు వచ్చిన వ్యక్తికి అత్యవసరంగా వాడే మందులు.. ASPIRIN 325 mg, Sorbitrate 5 mg

క్రమం తప్పని వ్యాయామం, సరిపడా నిద్ర అవసరం. కొవ్వు, ఫాస్ట్‌ఫుడ్‌ పదార్థాలు తీసుకోకూడదు.