చరిత్ర సృష్టించిన రిషి సునాక్‌

యూకే ప్రధాని బాధ్యతలు స్వీకరించిన రిషి సునాక్‌

భారతీయ కుటుంబానికి చెందిన రిషి యూకేలోని హ్యాంప్‌షైర్‌ సౌతంప్టన్‌లో 1980, మే 12న జననం

తండ్రి యశ్‌వీర్‌ వైద్యుడు, తల్లి ఉష సునాక్‌ ఫార్మసీ నడిపేవారు

తమ్ముడు సంజయ్‌ సైకాలజిస్టు, చెల్లి రాఖి ఐక్యరాజ్యసమితి విద్యా విభాగంలో చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్‌ (పీపీఈ)లో గ్రాడ్యుయేషన్‌, స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఎంబీఏ

ఎంబీఏ సమయంలో ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తితో పరిచయం

రిషి, అక్షతా 2009, ఆగస్టులో ప్రేమ వివాహం.. వీరికి అనౌష్క, కృష్ణ ఇద్దరు కుమార్తెలు

2015లో రాజకీయాల్లోకి ప్రవేశం.. కన్జర్వేటివ్‌ పార్టీ తరఫున యార్క్‌షైర్‌లో రిచ్‌మండ్‌ నుంచి ఎంపీగా ఎన్నిక

థెరిసా మే మంత్రివర్గంలో 2018 సమయంలో స్థానిక వ్యవహారాల శాఖ ఉప మంత్రిగా బాధ్యతలు

2019 సాధారణ ఎన్నికల్లో మరోసారి రిచ్‌మండ్‌ నుంచే ఎన్నిక.. 60% ఓట్లతో విజయం

2020లో అత్యంత కీలకమైన ఆర్థిక మంత్రి పదవి.. కీలక నిర్ణయాలతో ప్రశంసలు

ప్రధాని పదవికి లిజ్‌ ట్రస్‌ గుడ్‌బై.. 193 మంది ఎంపీల మద్దతుతో ప్రధానిగా రిషి అవతరణ