బిగ్‌డాగ్‌..పేరుకు తగ్గట్లు పెద్ద కుక్క సైజులో ఉంటుందిబోస్టన్‌ డైనమిక్స్‌ దీన్ని రూపొందించింది. 100 పౌండ్ల బరువును మోయగలదు. ధర దాదాపు 74 వేల డాలర్లు.

అట్లాస్‌..ఎమర్జెన్సీ సేవల కోసం రూపొందించింది.మనిషి వెళ్లలేని వాతావరణ పరిస్థితుల్లోకి వెళ్లి రావడం చేయగలదు. దూకడం, వేగంగా పరిగెత్తడం చేయగలదు. సుమారు 75 వేల డాలర్లు

డోగో..ఎనిమిది మైక్రో వీడియో కెమెరాలతో 360 డిగ్రీల కోణంలో చూస్తుంది. గురితప్పకుండా పేల్చేందుకు మరో రెండు బోరోసైట్‌ కెమెరాలుంటాయి.ధర సుమారు లక్ష డాలర్లు.

గ్లాడియేటర్‌..గూఢచర్యం, నిఘా, నిర్దేశిత లక్ష్యాలను గుర్తించడం, అడ్డంకుల ఛేదనలో ఉపయోగం.. అణు, రసాయన ఆయుధాల ప్రయోగాన్ని గుర్తించగలదు. ధర దాదాపు 4 లక్షల డాలర్లు.

గార్డ్‌బోట్‌.. రక్షణ మిషన్లలో పరిస్థితులను వీడియో తీసి లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయగలదు. దొర్లుకుంటూ పోగలదు.నిఘా కార్యక్రమాలకు ఉపయోగం.ధర సుమారు లక్ష డాలర్లు.

ఎల్‌ఎస్‌3..లెగ్గడ్‌ స్క్వాడ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ అంటారు. ఎలాంటి ఆర్డర్లు లేకుండానే నాయకుడిని ఫాలో కావడం దీని ప్రత్యేకత. ధర దాదాపు లక్ష డాలర్లు.

మార్స్‌ ..మాడ్యులార్‌ అడ్వాన్స్‌డ్‌ ఆర్మ్‌డ్‌ రోబోటిక్‌ సిస్టమ్‌కు సంక్షిప్త నామమే మార్స్‌. ఇది మానవ రహిత రోబో. మిలటరీ ఆవసరాల కోసమే తయారు చేశారు.ధర సుమారు 3 లక్షల డాలర్లు.

పీడీ100 బ్లాక్‌ హార్నెట్‌..ఫ్లిర్‌ సిస్టమ్స్‌ తయారీ. ఎక్కువగా గూఢచర్యంలో ఉపయోగపడతుంది.భారత్‌ సహా పలు దేశాల మిలటరీలు చాలా రోజులుగా వాడుతున్నాయి. ధర దాదాపు 1.95లక్షల డాలర్లు.

పెట్‌మాన్‌.. ప్రొటెక్షన్‌ ఎన్సెంబుల్‌ టెస్ట్‌ మానిక్విన్‌ సంక్షిప్త నామమే పెట్‌మాన్‌.భవిష్యత్‌లో రెస్క్యూ ఆపరేషన్స్‌లో వాడబోతున్నారు. దీని ధర దాదాపు 2.6 కోట్ల డాలర్లు.

సఫిర్‌..చూడ్డానికి మనిషిలాగా రెండు కాళ్లతో ఉంటుంది. దూరంలో ఉన్న శత్రు నౌకలను పసిగట్టగలదు. నావికాదళంలో వాడుతున్నారు. ధర సుమారు 1.5– 2.25 లక్షల డాలర్లు.