బైకులను ఎక్కుసేపు ఎండలో పార్కింగ్‌ చేయకూడదు.. ఒకవేళ బయట పార్క్‌ చేయాల్సి వస్తే అది.. చెట్టు నీడన, షెడ్లలో మాత్రమే

అధిక ఉష్ణోగ్రతలు.. బండి టైర్లలో తరచూ గాలి తనిఖీ చేయడం మంచిది

ఎండలో ఇంజిన్‌ అయిల్‌ త్వరగా వేడెక్కి పలచబడుతుంది, నిర్ణీత సమయంలో ఇంజిన్‌ అయిల్‌ మార్పు శ్రేయస్కరం

సాధ్యమైనంతవరకు మధ్యాహ్నం 1నుంచి 4గంటల వరకు ద్విచక్రవాహనంపై ప్రయాణం చేయకపోవడం ఉత్తమం

సాధారణ సీటు కవర్లు త్వరగా వేడెక్కుతాయి. ఇది మన ఆరోగ్యానికి కూడా హానికరం. కనుక వెల్వెట్‌, పోస్టు క్లాత్‌ వంటివి వాడాలి

పెట్రోలును నిండుగా నింపకూడదు. వేసవిలో పెట్రోలు వేడికి ఆవిరి అవుతుంది. మధ్యాహ్నం సమయంలో పెట్రోలు పోయించుకుకోకుండా ఉంటే మంచిది

వేసవి కాలం ముగిసేవరకు అలసత్వం వహించకుండా.. వాహనాలకు రెగ్యులర్‌ సర్వీసింగ్‌ మంచిది