అక్టోబరు 1 నుంచి కొత్త వేళలు

నడికుడి మార్గంలో రెండో లైను అందుబాటులోకి.. కాజీపేట మీదుగా వెళ్లే కొన్ని రైళ్లను ఈ మార్గం గుండా మళ్లించారు.

కొన్ని ప్యాసింజర్‌ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా, మరికొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా మార్చారు. కొన్ని రైళ్ల వేగాన్ని పెంచారు.

ప్రస్తుతం ఉన్న వేళల్లో ఒక్కో రైలుకు 5 నుంచి 10 నిమిషాల పాటు మారాయి.

దక్షిణ మధ్య రైల్వే వెబ్‌సైట్‌లో, అన్ని ప్రధాన స్టేషన్‌లలో ఆ వివరాలు అందుబాటులో ఉంటాయి.

ఎక్స్‌ప్రెస్‌ నుంచి సూపర్‌ఫాస్ట్‌ రైళ్లుగా మారినవి ఇవే..

సికింద్రాబాద్‌–మణుగూరు ఎక్స్‌ప్రెస్‌ (కొత్త నెం.02745/02746)

కాచిగూడ–మంగళూరు సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌ (02777/02778)

సికింద్రాబాద్‌–రాజ్‌కోట్‌ ఎక్స్‌ప్రెస్‌ (02755/02756)

కాకినాడ–భావనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ (02699/02700)

సికింద్రాబాద్‌–హిస్సార్‌ (02789/02790)

సికింద్రాబాద్‌–హిస్సార్‌ (02789/02790)

ప్యాసింజర్‌ నుంచి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా మారినవి..

హైదరాబాద్‌ డెక్కన్‌–పూర్ణ, హైదరాబాద్‌ డెక్కన్‌–ఔరంగాబాద్, తాండూరు–నాందేడ్, కాజీపేట–సిర్పూర్‌ టౌన్

భద్రాచలం రోడ్డు–సిర్పూర్‌ టౌన్, తాండూరు–పర్బణి, కాచిగూడ–గుంటూరు, కాచిగూడ–రాయచూర్‌