టీకా తయారీ విషయంలో భారత్‌ కీలకమైన ముందడుగు

మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీపై పట్టుసాధించిన హైదరాబాద్‌లోని సీసీఎంబీ శాస్త్రవేత్తలు

వ్యాధికారక సూక్ష్మజీవులు తమ రూపాన్ని ఎన్నిసార్లు మార్చుకున్నా కొత్త టీకాలను తయారు చేసేందుకు ఈ టెక్నాలజీ దోహదపడుతుంది

దేశంలో ఈ సాంకేతికతను తొలిసారి రూపొందించిన సంస్థ ఇదే కావడం విశేషం.

ఇప్పటివరకూ మోడెర్నా, ఫైజర్‌ వంటి అంతర్జాతీయ సంస్థల వద్దే ఈ టెక్నాలజీ

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ సమయంలో ఈ సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన సీసీఎంబీ

కేవలం 10 నెలల్లోనే టెక్నాలజీపై పట్టు సాధించామన్న సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌ నందికూరి

క్షయ, మలేరియా, డెంగీ వంటి అనేక వ్యాధులకు ఈ టెక్నాలజీ ఆధారంగా టీకాలు చేయొచ్చు

కోవిడ్‌ కోసం చేసిన టీకా 90 శాతం కంటే ఎక్కువ సామర్థ్యంతో యాంటీ బాడీలను ఉత్పత్తి.

ఎంఆర్‌ఎన్‌ఏ సాయంతో కేన్సర్‌కూ చికిత్స అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్న పలు సంస్థలు