పొటాటో పొంగనాలు

కావలసినవి: బంగాళదుంపలు-3 (మెత్తగా ఉడికించి, గుజ్జులా చేసుకోవాలి), ఉప్మా రవ్వ -1 కప్పు, బియ్యప్పిండి -1/4 కప్పు, అటుకులు- 2 టేబుల్‌ స్పూన్లు (నీటిలో నానబెట్టి)

చిక్కటి పాలు-1 కప్పు, బేకింగ్‌ సోడా -1/2 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు-1/2 కప్పు, జీలకర్ర-1 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు-1 టీ స్పూన్

అల్లం తరుగు-1 టీ స్పూన్‌, కరివేపాకు- కొద్దిగా(చిన్నగా తురమాలి), కొత్తిమీర తురుము-కొంచెం, ఉప్పు-తగినంత, నూనె-సరిపడా

తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని.. అందులో బంగాళదుంప గుజ్జు, ఉప్మా రవ్వ, బియ్యప్పిండి, అటుకులు, బేకింగ్‌ సోడా, ఉల్లిపాయ ముక్కలు,

జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తరుగు, కరివేపాకు తరుగు, కొత్తిమీర తురుము, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.

కొద్దికొద్దిగా పాలు పోసుకుని ముద్దలా చేసుకోవాలి.

అనంతరం పొంగనాల పాత్ర తీసుకుని ప్రతి గుంతలో కొద్దిగా నూనె పోసి, అందులో బంగాళదుంప మిశ్రమం వేసుకుని ఉడికించుకోవాలి.