గత 15 ఏళ్లగా అందరి ఇళ్లలో తప్పనిసరిగా మారిన గ్యాస్‌ సిలిండర్లు వాడకం

గ్యాస్‌ వాడకం ఎంత ముఖ్యమో, వాటిపై ఉన్న తేదీని గమనించడం అంతే ముఖ్యం. ఎందుకంటే?

సిలిండర్ల జీవితకాలం 15 సంవత్సరాలు. ఈ మొత్తం వ్యవధిలో తప్పనిసరిగా రెండుసార్లు భద్రతా పరీక్షలు నిర్వహించాలి

అసలు గ్యాస్‌ సిలిండర్‌పై ఉన్న ఈ పరీక్షల తేది గడువుని తెలుసుకోవడం ఎలా?

సిలిండర్ పై ఉన్న మెటల్ ప్లేట్లలో లోపలి వైపు ఉన్న నంబర్‌ వివరాలు గమనించాలి

ఉదాహరణకు సిలిండర్ పై A 25 అని ఉంటే.. జనవరి నుంచి మార్చి, 2025కి భద్రతా పరీక్షలు జరపాలని అర్థం

B అంటే ఏప్రిల్ – జూన్ అని, C – అంటే జూలై – సెప్టెంబర్ వరకు అని, D -అంటే అక్టోబర్ – డిసెంబర్ వరకు అని అర్థం

వీటిని తెలుసుకుని ఆ తేదిని బట్టి వాటికి భద్రతా పరీక్షలు జరిపించుకోవాల్సి ఉంటుంది

వీటితో పాటు ఇంటికి గ్యాస్ సిలిండర్ వచ్చాక పైన సీల్ ను చెక్‌ చేసుకోవాలి, సేఫ్టీ క్యాప్‌కు ఎటువంటి క్రాక్స్ ఉండరాదని నిబంధనలు చెబుతున్నాయి