రాజస్థాన్‌ రాష్ట్రంలోని సరిస్కా అటవీ సరిహద్దులో బంగర్‌ నగరం ఉంది. ఇక్కడి దెయ్యాల కథలు పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తాయి. రాత్ర సమయంలో ఈ ఘోస్ట్‌ టౌన్‌కి ప్రవేశం నిషేధం.

2.డుమాస్‌ బీచ్‌-గుజరాత్ ఇక్కడి ఇసుక నల్లగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని హిందూ స్మశాన వాటికగా ఉపయోగించేవారని, ఆత్మలు అక్కడ తిరుగాడుతాయని చెబుతారు.

3.శనివార్వార్‌-వాడా(పుణె) నారాయణరావ్ పేష్వా హత్యగావించబడింది ఇక్కడే. అతడి ఆర్తనాదాలే ఇప్పటికీ రాత్రి వేళలో ఆ కోటలో వినిపిస్తాయని అంటూ వుంటారు.

4.కుల్దర్‌ గ్రామం-రాజస్థాన్‌ జైసల్మేర్‌కి 20 కిమీ దూరంలో ఉంది. ఈ గ్రామం శాపానికి గురైందని.. అక్కడ దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయని స్థానికులు నమ్ముతారు.

5.డౌ హిల్‌-డార్జిలింగ్‌ బ్రిటీష్‌ వాళ్ల కాలంలో అక్కడ ప్రజలు ఆత్మహత్య చేసుకునే వాళ్లట. రాత్రి సమయం అక్కడకు వెళ్లినవారు ఇంతవరకు తిరిగొచ్చింది లేదట.

6.జగత్‌పురా-జైపూర్‌ జగత్‌పురాలో రాత్రి సమయంలో అక్కడి శిథిలమైన భవనం నుంచి వింత శబ్దాలు వినిపిస్తాయని అక్కడి ప్రజలు చెప్తుంటారు.

7.రాజ్‌కిరణ్‌ హోటల్‌, లోనావాలా ఈ హోటల్‌లోని ఓ గదిలో రాత్రిపూట బెడ్‌షీట్‌లు లాగేయడం, వింత శబ్దాలు రావడం, గదిలో ఎవరో ఉన్నట్లు అక్కడ బస చేసిన వాళ్లు చెప్తుంటారు.

8.ఢిల్లీ కంటోన్మెంట్ రోడ్ రాత్రిపూట ఇక్కడ తెల్లటి చీరలో ఒక మహిళ కనిపిస్తుందని స్థానికులు చెబుతుంటారు. ఈ రహదారిని రాత్రి వేళల్లో దాటడానికి ఎవరూ సాహసించరు.

9.గ్రాండ్ పారాడి టవర్స్‌-ముంబై గ్రాండ్ పారాడి టవర్స్‌లోని వివిధ అంతస్తుల నుంచి ప్రజలు దూకి అత్మహత్య చేసుకుంటుంటారు. ఎనిమిదో అంతస్తు అన్నింటికంటే ఎక్కువ భయానకం.

10. జతింగ-అస్సాం ఎన్నో రకాల పక్షులు ఇక్కడికి వలస వస్తుంటాయి. హరికిరి పక్షులు పొగ మంచులో తిరుగుతూ కాలుతున్న మంటల్లోకి దూకి ప్రాణాలు వదిలేస్తాయట.

11.లంబి దేహార్ మైన్స్-ఉత్తరాఖండ్‌ ఇక్కడ మైనింగ్‌ చేస్తూ సుమారు 50వేల మంది చనిపోయారట. అనేక వాహన ప్రమాదాలతో పాటు హెలికాప్టర్ కూలిన ఘటన జరిగినట్లు చెప్తుంటారు.

12. ముఖేశ్‌ మిల్స్‌ -ముంబై ఈ ప్రాంతం ఉదయం పూట పర్యాటకులతో కిటకిటలాడుతుంది. భయంగొలిపే ప్రదేశంకావడంతో రాత్రి మాత్రం నిర్మానుష్యంగా మారుతుంది.