ఆఫ్రికాలో మొదలైన మంకీ పాక్స్‌ కేసుల విజృంభణ.. యూరప్‌, నార్త్‌ అమెరికాలోను వైరస్‌ వ్యాప్తి

అమెరికాలో గురువారం వెలుగుచూసిన తొలికేసు.. కెనడాలో నుంచి వచ్చిన వ్యక్తిలో వైరస్‌

ఆర్థోపాక్స్‌ వైరస్‌ కుటుంబానికి చెందిన.. మంకీ పాక్స్‌ వైరస్‌ను మనీపాక్స్‌ వైరస్‌ అని పిలుస్తారు

తొలుత జంతువుల నుంచి మనుషులకు సోకిన మంకీపాక్స్‌

మనిషి నుంచి మనిషికి సోకుతుంది. ప్రధానంగా ముఖం ద్వారా శరీరంలోకి ప్రవేశం

బాధితుల తుంపర్లు, శారీరక కలయిక, కలుషిత పదార్థాల ద్వారా వైరస్‌ వ్యాప్తి

జ్వరం, కండరాల నొప్పులు, ఒంటి మీద దుద్దుర్లు వ్యాధి లక్షణాలు

ఈ వైరస్‌ బారినపడినవారు కోలుకునేందుకు 15 రోజుల సమయం పడుతుంది

1950లో మంకీ పాక్స్‌ తొలి కేసు కోతుల్లో వెలుగుచూసింది

1970లో కాంగోలో మనుషుల్లో మంకీపాక్స్‌ వైరస్‌ను గుర్తించారు