భారతీయ విద్యార్థుల మొగ్గు అమెరికావైపే

ఉద్యోగావకాశాలు, యూఎస్‌ డిగ్రీకి ప్రపంచవ్యాప్త గుర్తింపే కారణం

2020 కంటే 2021లో 12 శాతానికి పైగా పెరిగిన భారతీయ విద్యార్థుల సంఖ్య

ఈ విద్యార్థుల్లో 37 శాతం మంది మహిళలే

యూఎస్‌సీఐఎస్‌ నివేదికలో వెల్లడి

మొత్తం మీద అమెరికాలో చైనా విద్యార్థులే అత్యధికం

2020తో పోలిస్తే 2021లో చైనా నుంచి వెళ్లినవారిలో 33,569 మంది తగ్గారు

భారతదేశం నుంచి చూస్తే 2020లో కన్నా 2021లో 25,391 మంది అదనంగా పెరిగారు

అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకొనే విద్యాసంస్థల సంఖ్య కూడా 2020తో పోలిస్తే 2021లో తగ్గింది

2020లో 8,369 విద్యాసంస్థలకు అర్హత ఉండగా 2021లో 8,038 సంస్థలకు మాత్రమే అర్హత దక్కింది