కావల్సినవి: తలకాయ మాంసం – కేజీ ఉల్లిపాయ ముక్కలు – రెండు కప్పులు

టొమోటో తరుగు – రెండు కప్పులు దాల్చిన చెక్క – రెండంగుళాల ముక్క

లవంగాలు – పది యాలకులు – నాలుగు

పసుప టీస్పూను ఉప్పు, కారం – రుచికి సరిపడా

పచ్చిమిర్చి చీలికలు – ఐదు అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు టేబుల్‌ స్పూన్లు

కొత్తిమీర తరుగు – అరకప్పు పుదీనా – గుప్పెడు

ఆయిల్‌ – ఐదు టేబుల్‌ స్పూన్లు మిరియాలు – టేబుల్‌ స్పూను ధనియాలు – నాలుగు టేబుల్‌ స్పూన్లు

ఎండు కొబ్బరి తురుము – పావు కప్పు బిర్యానీ ఆకులు – రెండు

తయారీ.. ∙ మాంసాన్ని శుభ్రంగా కడిగి కుకర్‌ గిన్నెలో వేయాలి.

తరిగిన ఉల్లిపాయ, టమోటో, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, కారం, ఉప్పు పచ్చిమిర్చి , పసుపు, అల్లం పేస్టు, ఆయిల్‌ వేసి కలిపి రెండు గ్లాసుల నీళ్లు పోయాలి

మూతపెట్టి మీడియం మంట మీద 20 నిమిషాలు ఉడికించాలి.

తరువాత ముక్క మెత్తబడితే ఓకే. లేదంటే మరికొంతసేపు ఉడికించుకోవాలి

ధనియాలు, మిరియాలు, కొబ్బరిని కలిపి పొడిచేసుకోవాలి. స్టవ్‌ మీద మరో బాణలి పెట్టి ఆయిల్‌ వేసి, వేడెక్కనివ్వాలి

తరువాత మిగిలిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ ఆకు వేసి వేగనివ్వాలి

తరువాత మసాలా పొడి, రుచికి సరిపడా కారం, ఉప్పు చూసి వేసుకుని గ్రేవీకి సరిపడా నీళ్లుపోసి ఉడికించాలి

గ్రేవీ దగ్గరపడిన తరువాత కొత్తిమీర చల్లితే తలకాయ కుర్మా రెడీ