కావల్సిన పదార్థాలు: చికెన్‌ ఖీమా – పావు కేజీ

ఉల్లిపాయలు – రెండు (గుండ్రంగా రింగుల్లా తరగాలి), స్రింగ్‌ ఆనియన్‌ కాడలు – రెండు (సన్నగా తరగాలి)

వెల్లుల్లి తురుము – టేబుల్‌ స్పూను, కారం – టీ స్పూను, చీజ్‌ – అరకప్పు

ఉప్పు – రుచికి సరిపడా, గోధుమ పిండి – కప్పు

గుడ్లు – మూడు, బ్రెడ్‌ ముక్కలపొడి – కప్పున్నర, ఆయిల్‌ –సరిపడా

ముందుగా కడిగిన చికెన్‌ ఖీమాను ఒక గిన్నెలో తీసుకుని స్ప్రింగ్‌ ఆనియన్‌ , వెల్లుల్లి తరుగు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.

గోధుమపిండిలో కొద్దిగా ఉప్పు, గుండ్రంగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను ముంచి పక్కన బెట్టుకోవాలి.

గుడ్ల సొనను ఒక గిన్నెలో , ప్లేటులో బ్రెడ్‌ ముక్కల పొడి తీసుకోవాలి.

ఇప్పుడు ఉల్లిపాయ రింగుల్లో.. కలిపి చికెన్‌ ఖీమా మిశ్రమాన్ని పెట్టి, మధ్యలో చీజ్‌ తరుగు పెట్టి గుండ్రంగా వత్తుకోవాలి.

ఈ ఆనియన్‌ రింగ్స్‌ను గుడ్డు సొన, బ్రెడ్‌ముక్కల పొడిలో వరుసగా రెండుసార్లు ముంచి, పదిహేను నిమిషాలు రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి.

డీప్‌ఫ్రైకి సరిపడా ఆయిల్‌ వేడెక్కాక.. ఆనియన్‌ రింగ్స్‌ను గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌లోకి వచ్చేంత వరకు వేయిస్తే సరిపోతుంది.